విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని విజయ శక్తి విద్యాలయం వరదలతో పూర్తిగా మునిగిపోవడంతో విద్యార్థుల పుస్తకాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఆ స్కూల్లో చదువుకున్న 2002 విద్యా సంవత్సరం బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఇబ్రహీంపట్నం ఎంఈఓ చెరుకూరి పుష్పలత సమక్షంలో 260 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందించారు. ప్రధానోపాధ్యాయులు తులసీ ద్వారా ఈ విషయం తెలియడంతో ఆనాటి మా తోటి విద్యార్థుల అందరి సహకారంతో 50 వేల రూపాయల విలువైన నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ ఎప్పుడో చదువుకున్న విద్యార్థులు అయినా తాము చదువుకున్న పాఠశాలలో విద్యార్థుల పుస్తకాలు నీటిలో పూర్తిగా తడచిపోయాయని తెలుసుకున్న వెంటనే తమ సహచర విద్యార్థుల సహకారంతో సమయాన్ని వెచ్చించి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం గర్వించదగిన విషయమని అన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …