-లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందజేసిన
-జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
-స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని దేశ ప్రధాని గౌరవ నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. పట్టణ ప్రాంత పేదలకోసం పిఎంఏవై అర్బన్, గ్రామీణ ప్రాంతాలకోసం పిఎంఏవై గ్రామీణ్ పథకాలను ప్రవేశపెట్టారు. లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. ఒడిషా రాష్ట్రంలో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
పిఎంఏవై ప్రారంభ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఓబుళపతి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, పుట్టపర్తి మున్సిపాలిటీ కమిషనర్ ప్రహ్లాద తిలకించారు. పిఎంఏవై గ్రామీణ్ పథకం క్రింద పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదవ వార్డ్ సంబంధించిన ఏ తులసి, ఐదవ వార్డుకు సంబంధించిన పల్లవి, 14 వార్డుకు సంబంధించిన సరస్వతి, 15 వార్డుకు సంబంధించిన శాంతమ్మ బాయ్, నాలుగో వార్డుకు సంబంధించిన సుగుణమ్మ, వినోద్ వార్డుకు సంబంధించిన పద్మావతి, నాగమణి, ఆరో వార్డుకు సంబంధించిన సుమ బాయ్, 11వ వార్డుకు సంబంధించిన ఎస్ అమీనాఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయగా, వారికి ఇళ్ల తాళాలను అందజేశారు. ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకొని ఇళ్లను పూర్తి చేసుకున్నందుకు లబ్దిదారులను కలెక్టర్,
ఎంఎల్ఏ అభినందించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, మున్సిపాలిటీ, మెప్మా, టిడ్కో ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్దిదారులు పాల్గొన్నారు.