గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలని, డ్రైవ్ మోడ్ లో అన్ అసెస్మెంట్లు, అండర్ అసెస్మెంట్లకు పన్ను విధింపు జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా వసూళ్ళ పై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి ఉండాలని, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తదుపరి సమావేశానికి పురోగతి ఉండాలని, వసూళ్లకు వారపు లక్ష్యాన్ని నిర్దేశించాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు, నగరపాలక సంస్థ షాప్ ల అద్దెలు వసూళ్లు, రెన్యువల్స్ అంశాల వారీగా నివేదికలు అందించాలన్నారు. సదరు నివేదికల మేరకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాలు మేరకు పురోగతి లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మొండి బకాయిదార్ల నుండి పన్ను వసూళ్ళకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయాలని, బకాయిదార్ల వివరాలను ప్రకటనల రూపంలో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేస్తామని వారికి నోటీసుల ద్వారా తెలియచేయాలన్నారు. మొండి బకాయిదార్లు స్పందించని ఎడల వారీ ఆస్తికి సంబందించిన నీటి కుళాయి, విద్యుత్ సరఫరా నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పన్ను బకాయిలు అధిక మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయని, వాటి వసూళ్ళ పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు బాలాజీ బాష, రెహమాన్, సూపరిండెంట్ వెంకట రామయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …