విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై జరగబోయే దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. జిల్లా కలెక్టర్ డా జి.సృజన, పోలీస్ కమిషనర్ ఏస్ వి రాజశేఖర్ బాబు, పలు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. పది రోజులపాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారి అమ్మవారి ఉత్సవాల నిర్వహిస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు ఇవ్వకుండా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని దసరా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు భక్తుల సలహాలు సూచనలు పొందేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించాలని అధికారులకు తెలియజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సమావేశంలో డిసిపిలు గౌతమి శాలి, యం. కృష్ణమూర్తి నాయుడు, అడిషనల్ డిసిపిలు జి. రామకృష్ణ, యం. రాజరావు, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఆర్‌డివో భవాని శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, దేవస్థానం ఈఈలు ఎల్. రమ, కోటేశ్వరరావు, వివిధ విభాగాల సూపరింటెండెంట్‌లు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …