Breaking News

గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ఇసుక బుకింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నదని, ఇందుకోసం గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందికి ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న 8 మాన్యువల్ ఇసుక రీచ్ ల అనుమతులు ఫిబ్రవరిలో ముగుస్తున్నందున, జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా, రెవెన్యూ, మైన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి కొత్త మాన్యువల్ రీచ్ లు ముందుగానే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉన్న వాటిని సెమి మాన్యువల్ రీచ్లుగా కన్వర్ట్ చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి సాధ్యమైనంతవరకు ఒక్కొక్క రీచ్ పరిధిలో ఒక్కొక్క స్టాక్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా వాటి నిర్వహణ సులభం అవుతుందని, వినియోగదారులకు వారి సమీపంలోనే ఇసుక లభ్యం అవుతుందన్నారు. ఇసుక ఆన్లైన్ విధానంలో గ్రీవెన్స్ పరిష్కరించడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దూరాన్ని బట్టి ఒకే విధంగా ఇసుక రవాణా చార్జీలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా గనుల శాఖ అధికారి కొండారెడ్డి కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో ట్రాన్స్పోర్టర్లతో సమావేశం నిర్వహించి, ఇసుక రవాణాకు ట్రాన్స్పోర్టర్ల ఎంపానల్మెంట్ ఏజెన్సీల జాబితా తయారు చేయడానికి వారి ఆసక్తి అంగీకారం తెలపాల్సి ఉంటుందని, వారికి ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంలో తమ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ విధివిధానాలు వారికి వివరించారు.

ఈ సమావేశంలో డిటిసి పురేంద్ర, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి విజయవర్ధన్ రావు, డిపిఓ నాగేశ్వర నాయక్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి. శివరామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *