Breaking News

నిత్యవసర ధరల నియంత్రణకు కమిటీ తగిన సిఫార్సు లు చేయాలి

-సీజన్ల వారి డిమాండు ఆధారంగా పంటలు వేసే విధానంలో క్రమబద్ధీకరణ ఉండాలి
-కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యవసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ మరియు నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఏ సీజన్లలో ఏ కూరగాయలు పండించడం జరుగుతోంది, ఎంత వరకు ఉత్పత్తి వొస్తోంది అనే వివరాలు నెల వారీగా గణాంకాలను ఖచ్చితంగా సేకరించి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల వారీగా నిత్యావసర వస్తువుల డిమాండు, దిగుబడి, వినిమయం ఆధారంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న కూరగాయలు , ఇతర నిత్యావసర సరుకుల ధరల పై దృష్టి పెట్టాలని, నివేదిక అందచేయాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మార్కేట్ లో ప్రీమియం, మీడియం, సాధారణ కేటగిరి లను అనుసరించి కూరగాయలు అందుబాటులో ఉంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతీ వారం కమిటి సమావేశం నిర్వహించే క్రమంలో దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అందులో భాగంగా మూడు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమేరకు నియంత్రణ పద్ధతులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతుకు అయ్యే ఉత్పాదక వ్యయం – రైతు గిట్టుబాటు ధర, హోల్ సేల్ వ్యాపారం వద్ద లభించే ధర – మార్కెట్ లో ధర లు, బహిరంగ మార్కెట్ లో జరిపే అమ్మకాల ధరలు పై నివేదిక కు అనుగుణంగా ప్రతి నెలా నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. తద్వారా వినియోగదారునికి నిత్యావసర వస్తువుల సహేతుకమైన ధరలకు అందుబాటులోకి తీసుకుని రావడం సాధ్యం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్ద మార్కెట్ ప్రాంతంలో రైతులు ప్రతి రోజూ ఉదయం కూరగాయలు, ఆకు కూరలు అమ్మకాలు జరుతున్నట్లు సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం ద్వారా, వారికి ఒక అనువైన చోట వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. మార్కెట్ యార్డు లేదా మరొక ప్రాంతంలో వారికి స్థలాన్ని కేటాయించి, అక్కడ వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించడం పై జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరడం జరిగింది. తూకం, కొలతలు విషయంలో తనిఖీలు నిర్వహించాలని లీగల్ మెట్రాలజి అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఉత్పత్తి తగ్గిందని కూరగాయ ఆకుకూరలు ధరల్లో వత్యాసం లేకుండా నియంత్రణా చర్యలుపై ప్రత్యెక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు సూచించారు. సీజన్ వారీగా పంటలు వేసే విధానంలో క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైతే ఎక్కడ నుంచి ఎక్కువగా ఏ ఏ కూరగాయలు పంటలు సాగు విస్తీర్ణం ఉందో గుర్తించి, అక్కడ నుంచి కొనుగోలు చెయ్యాల్సి ఉంటుందని, నో లాస్, నో ప్రాఫిట్ విధానంలో వినియోగదారులకు కూరగాయలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో కె ఎల్ శివ జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, డిఎంసి ఎస్ టి రాధిక, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఎస్ మాధవరావు, ఎమ్ సునీల్ వినయ్, బి. సుజాత కుమారి, ఏ.. దుర్గేష్ , ఎల్ అప్పల కొండ, ఎన్వివిఎస్ మూర్తి, శ్యామూల్ రాజ్, కమిటి సభ్యులు జి. అనంత రావు, టీ. తాతబ్బాయి, పి రాంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ జవ్వర్, ఉల్లిపాయలు హోల్ సేల్ మార్కెట్ ప్రతినిధి, రైతులు, జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *