Breaking News

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛత హి సేవ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి  ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు లక్ష్యా లు నూరు శాతం సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి విద్యాశాఖాధికారి వి వెంకట్రాజు, ఉప విద్యాశాఖాధికారి, ఇ.వి.బి. యన్. నారాయణ, సి ఆర్ ఎం టి లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్ కే వి టి ప్రభుత్వ ఉన్నత పాఠ శాల, ఉపాధ్యాయులు, కంటిపూడి రామారావు, నెహ్రు నగర్ ఉన్నత పాఠశాల చున్నిలాల్ జాజు ఉన్నత పాఠశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *