బొమ్మూరు/ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బొమ్మూరు నందు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జరిగిందని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు జున్నూరు రాజు తెలియ చేశారు. సోమవారం న్యాక్ కార్యాలయంలో శిక్షకులు మూడో రోజు శిక్షణ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా సహాయ సంచాలకులు వివరాలు తెలియ చేస్తూ, న్యాక్ ఆధ్వర్యంలో విద్యార్థులకి శిక్షణ అంద చేసే “శిక్షకులకు శిక్షణ” కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. . ఈ శిక్షణా కార్యక్రమానికి వివిధ జిల్లా నుండి 50 మంది ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ లు హాజరైనట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా, సమగ్ర శిక్షా అభియాన్ లోని, ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ లకు, ఫీల్డ్ టెక్నీషియన్-అదర్ హోమ్ అప్లియన్సెస్ జాబ్ రోల్ నందు శిక్షకులని శిక్షణ తరగతులని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ రెసిడెన్టీయల్ శిక్షణను మాస్టర్ ట్రైనర్స్ సి.హెచ్, గంగాదాస్, ఏ. కార్తికేశ్వరయ్య ద్వారా శిక్షకులకు శిక్షణ తరగతులని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణానంతరం స్కిల్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో జిసిడిఒ ఎస్తేరు రాణి, శిక్షణ సమన్వయకర్త సయ్యద్ అహ్మద్, పర్యవేక్షణ అధికారి శిక్షకులు పాల్గొన్నారు.