Breaking News

తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ తదితరాలు ఉన్నాయని, అలాగే పలు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు జరుగుతుంటాయి అని, పలు పర్యాటక ప్రదేశాలు తదితరాలు ఉన్న నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి లోటుపాట్లు, వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్, ఎస్పి సుబ్బరాయుడు లతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు జరుగుతుంటాయి అని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్ లు కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీ వారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనల్లో వారి కేడర్ ఆధారంగా సరియైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరియైన రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ భద్రత చర్యలు ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉండాలని సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రత స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీస్ సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి రవి శంకర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, టీటీడీ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *