-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం “ఇది మంచి ప్రభుత్వం” శీర్షికతో ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు చేసిన కార్యక్రమాలు గురించి తెలియజేసే కరపత్రాన్ని శిఖామణి సెంటర్ నందు సచివాలయం సిబ్బంది ప్రజలకు అందజేస్తున్న పనితీరును విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అన్న శీర్షికతో సచివాలయం సిబ్బంది ప్రజలకు కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందిస్తూ వచ్చిన మొదటి వంద రోజుల్లోనే ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేలా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీలో 16.437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టడం, పెంచన్లను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకరోజే 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి రూపాయిలు 4, 408 కోట్ల పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రని, ప్రతినెలా ఒకటో తారీకునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని, 1674.4.7 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని, స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారని, పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని, విజయవాడ నగరం వరదల్లో వెలుగుల లాడుతున్నప్పుడు పది రోజులపాటు బస్సులోనే ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్న చంద్రబాబు ని, తెలిపే ఈ కరపత్రానికి పంపిణీ సచివాలయం సిబ్బంది ప్రజలకు అందిస్తున్న తీరును విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు.