Breaking News

రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తాం…

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక జిఎస్‌డబ్ల్యుఎస్‌ గేర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తామని, వందరోజుల నూతన ప్రభుత్వ పాలన సంతోషదాయకమని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక జిఎస్‌డబ్ల్యుఎస్‌ గేర్‌ (గ్రామ వార్డు సెక్రటేరియట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్స్‌ రిప్రెజెంటేటివ్స్‌). శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో దిగ్విజయంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి 1.34 లక్షలమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తూ విజయవాడ చరిత్రలో కనీ వినీ ఎరుగని విపత్తును సైతం మనోధైర్యంతో ఎలా ఎదుర్కోవాలో చాటి చెప్పి రాష్ట్ర పాలనా వ్యవస్థను పరుగులు పెట్టించి ప్రజలకు మెరుగైన సేవలందించడం మరియు అందులో యువ ఉద్యోగులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను భాగస్వాములు చేసి ప్రజలకు విపత్కర పరిస్థితిలో సేవలందించే అవకాశం ఎంతో స్పూర్తి కలిగించిందన్నారు.
ఇటీవల ఉద్యోగులను కొన్ని ప్రాంతాల్లో అసభ్య పదజాలంతో కొంతమంది రాజకీయ నాయకులు దూషించిన ఘటన బాధాకరమన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గేర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వచ్చే వారం ప్రభుత్వ పెద్దలు అధికారులకు వినతి అందించడం కోసం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి చిన్న చిన్న సమస్యల విషయంలో కొంత బాధ కలిగి ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం అవుతాయని, సమాజంలో ఉద్యోగులపట్ల చులకన భావం ఏర్పడుతుందని అలా కాకుండా మమ్మల్ని గుర్తించి అటువంటి సమస్యలు పునరావృత్తం కాకుండా మా సేవలను వినియోగించుకోవాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావడమే లక్ష్యంగా సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై దయచూపి ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించి పే స్కేల్‌ మార్పు చేయడంతోపాటు సమాజంలో గౌరవం పెంపొందించే విధులు మాత్రమే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని 1.34లక్షల సచివాలయ ఉద్యోగుల మనోగతాన్ని పరిగణలోకి తీసుకొని తగు పరిష్కారం చూపాలని గేర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎం.డి.జాని పాషా, షేక్‌.అబ్దుల్‌.రజాఖ్‌, వేల్పుల.అరలయ్య, బత్తుల.అంకమ్మ రావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *