-ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం 500 సెంటర్లలో గౌరవ ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారం మరియు 50 సెంటర్లో కార్యక్రమం ప్రత్యక్షంగా నిర్వహణ
-ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి విశ్వ కర్మ పథకం కుల వృత్తులు చేసుకునే వారికి ఒక గొప్ప వరం అని సద్వినియోగం చేసుకోవాలని ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం ను ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో వాధ్రా పట్టణం, మహారాష్ట్ర నుండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీ గారు వర్చువల్ విధానంలో అన్ని రాష్ట్రాలలోని పలు జిల్లాలతో అనుసంధానమై తమ సందేశాన్ని అందించిన నేపథ్యంలో ఎంఎస్ఎంఈ, న్యాక్, నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వ కర్మ పథకం మొదటి వార్షికోత్సవ మనం జరుపుకుంటున్న సందర్భంగా మన అందరికి సందేశం ఇవ్వడానికి ప్రధానమంత్రి స్వయంగా వర్చువల్ గా మహారాష్ట్ర వార్దా నుండి పాల్గొంటున్నారని ఈ సందర్భంగా విచ్చేసిన చేతివృత్తుల సోదర సోదరీమణులకు అందరికీ ధన్యవాదాలు అని తెలుపుతూ దేవుడు ప్రాణం పోసి మనిషిని సృష్టిస్తే మీరు ఎంతో నైపుణ్యంతో అద్భుతమైన కళాఖండాల్ని తయారు చేసి వాటికి జీవకల ఉట్టిపడేలాగా చేసే సృష్టికర్తలు అని, భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ దేశంలో లక్షల మందికి చేతి వృత్తుల మీద ఆధారపడిన వారికి అండగా నిలిచే ప్రయత్నం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేశారని, గ్రామాల సాధికారికతకి చేతివృత్తుల వాళ్లే ప్రధానం అని అన్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం మన ఘనమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం కోసం వారికి భరోసా ఇచ్చి అండగా నిలబడేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. అద్భుతమైన చెక్కబొమ్మలు, రాతి విగ్రహాలు తయారు చేసే, ఇత్తడి,ఇనుము విగ్రహం తదితరాలు చేసే 18 రకాల చేతి వృత్తులపై లబ్ధిదారులను గుర్తించి వాటిలో నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆర్థికంగా తోడ్పాటు అందించి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
స్థానిక తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ఈరోజు విశ్వకర్మలను గుర్తించి వారికి చేతివృత్తులు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందనీ అన్నారు. చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా రెండు లక్షల రూపాయలు ఐదు శాతం వడ్డీకి ఇవ్వడం చాలా సంతోషకర విషయమని, వడీలకి డబ్బు తీసుకోవడం సంపాదించిన డబ్బులు అంతా వడ్డీలకే కట్టుకోవడం వంటి పరిస్థితులు ఉంటాయని గుర్తించి దాదాపు రెండు లక్షల వరకు తక్కువ వడ్డీకే ఇచ్చి వారి ప్రోత్సహించడం ప్రధానమంత్రి గారి మోడీ గారి ఔన్నత్యం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విశ్వ కర్మ పథకం కింద చేతి వృత్తులు పనులపై ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి తద్వారా వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం జరుగుతోందని తెలిపారు. మన జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలంకారీ ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో రికార్డు అని తెలిపారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇంకా ఎన్నో మంచి మంచి ఫలితాలు మన ప్రధానమంత్రి గారి సహకారంతో అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు వంటి బృహత్తర పనులు సాధించుకోవడం జరుగుతోందని తెలిపారు.
ఈ పీఎం విశ్వకర్మ పథకం కింద మన జిల్లాలో 43,287 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, మూడు విభాగాల్లో వెరిఫికేషన్ పూర్తి అయినటువంటి వారు 12394. మన జిల్లాలో 13 ట్రైనింగ్ సెంటర్లలో పీఎం విశ్వకర్మ 8 జాబ్ రోల్స్ లో ప్రారంభించబడి, 9744 మంది ఇప్పటివరకు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 10 బ్యాచులు శిక్షణ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా డిబిటి పొందిన అమౌంటు రూ. 1,61,49,000, 6998 మందికి టూల్ కిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకురుణ సౌకర్యం అర్హత కలిగినటువంటి వారు 852 వారికి రుణ సదుపాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఎం విశ్వకర్మ, నైపుణ్యశిక్షణ పొందినటువంటి అభ్యర్థులకి గౌరవ మంత్రివర్యులు సర్టిఫికెట్స్ అందించడం జరిగినది మరియు యూనియన్ బ్యాంకు ఎల్డీఎం ద్వారా , ఈ పీఎం విశ్వకర్మకు సంబంధించి నైపుణ్య శిక్షణ పూర్తయిన తర్వాత 1392 బ్యాంకు అకౌంట్స్ కు రుణ సౌకర్యానికి చర్యలు చేయడం జరిగింది. అలాగే బ్యాంకుల ద్వారా ఆర్థికరుణ సహాయం 9 కోట్ల 34 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించినటువంటి చెక్కులను గౌరవ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే చేతులమీదుగా ద్వారా అందచేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, దినేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఏడిజి NAC, రాంప్రసాద్, డిజిఎం, యూనియన్ బ్యాంక్, ప్రతాపరెడ్డి, జిఎం,డిఐసి, ప్రభావతి, పిడి, డిఆర్డిఏ, విశ్వనాధ్ రెడ్డి, ఎల్డిఎం, సతీష్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, ఎం ఎస్ డి ఈ, శివ కుమార్, ఎం ఎస్ డి, శ్రీ.కిరణ్, డైరెక్టర్, NAC, ఎన్ శ్యామ్మోహన్, ఆర్ ఎస్ డి ఓ, ఆర్, లోకనాథం, డి ఎస్ డి ఓ ఏపీ ఎస్ఎస్డిసి, సతీష్ చంద్ర ఏడి,NAC, శివరామిరెడ్డి, కోఆర్డినేటర్,పీఎం విశ్వకర్మ, మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనడం జరిగినది.