గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చత హి సేవాలో భాగంగా నగర ప్రజలకు స్వచ్చతపై అవగాహన కల్పిస్తూ, వారిని స్వచ్చ గుంటూరు సాధనలో భాగస్వాములను చేయడానికి ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 6:30 గంటలకు జిఎంసి ఆధ్వర్యంలో సైక్లోథాన్ (సైకిల్ ర్యాలీ) చేపడుతున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ స్వచ్చత హి సేవా 2024 లో భాగంగా సైక్లోథాన్ (సైకిల్ ర్యాలీ) ఆదివారం ఉదయం 6:30 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద ప్రారంభమై రమేష్ హాస్పిటల్, శంకర్ విలాస్ సెంటర్, మధర్ దెరిస్సా విగ్రహం సెంటర్, కొరెటపాడు సెంటర్, గుజ్జనగుండ్ల జంక్షన్, కంకరగుంట ఫ్లై ఓవర్ మీదుగా తిరిగి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి చేరుతుందని తెలిపారు. ర్యాలీలో విద్యార్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …