Breaking News

సంక్షేమల్లో సదుపాయాలు ప్రాధాన్యత

-సీఏస్ఆర్ కింద అభివృద్ధి పనులు
-కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ వసతి గృహాలలో “సి ఎస్ ఆర్” కింద వసతుల కల్పన పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు అంచనాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో సంక్షేమ, పరిశ్రమల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సి ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, చేపట్టవలసిన పనులు, అందుకు అనుగుణంగా సిద్దం చేసిన ప్రతిపాదనలు పై వసతి గృహాల వారీగా సమీక్షించడం జరిగింది. నివాస యోగ్యంగా లేని, శిథిలావస్థ స్థితిలో ఉన్న వసతి గృహాలను వేరొక చోటకు మార్పు చెయ్యాలన్నారు. మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వసతి గృహాల వారీగా పనుల పై సమీక్షించడం జరిగిందన్నారు. ఆమేరకు ఆయా పనులను కార్పొరేట్ సామాజిక బాధ్యత తో స్థానికంగా ఉండే పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టడానికి పరిశ్రమల శాఖ, ఫాక్టరీస్ శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు.

సాంఘిక సంక్షేమ శాఖ చెందిన వసతి గృహాలు కడియం (బాలికల ) , బాలుర వసతి గృహాలు రంగంపేట , దుద్దుకూరు, నల్లజర్ల , కానూరు, తాళ్లపూడి లలో చేపట్టవలసిన పనులకు సంబంధించి వివరాలు అందచేశారు. అదే విధంగా బీసీ సంక్షేమ పశు గృహాలకు సంబంధించి రాజమండ్రి బాలుర రాజమండ్రి పట్టణ ప్రాంతంలోని బిసి కాలేజీ బాయ్స్ హాస్టల్, నిడదవోలు బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ , కానూరు బేసి గర్ల్స్ హాస్టల్ లలో ప్రతిపాదించిన పనులు వివరించారు. రాజానగరం బాలుర , కోరుకొండ బాలికల కాలేజీ వసతి గృహాలను వేరొక భవనంలోకి మార్పు కు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశికాల ఆవరణలోని బాయ్స్ గర్ల్స్ హాస్టల్ గోకవరం బాయ్స్ హాస్టల్ పరిథిలో చేపట్టవలసిన పనులని అధికారులు తెలియ చేశారు.

జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా పరిశ్రమల, పరిశ్రమల తనిఖీ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, సమగ్ర వివరాలు అందచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ . అప్పలకొండ, పరిశ్రమంలో సహాయ సంచాలకులు పి.. ప్రదీప్ కుమార్, జిల్లా ఫ్యాక్టరీస్ తనిఖీ అధికారి జి. స్వాతి, సంక్షేమ అధికారులు కే ఎస్ జ్యోతి, ఎమ్ సందీప్, బి. శశాంక లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *