Breaking News

పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సల్సా వారి ఆదేశానుసారం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పారా లీగల్ వాలంటీర్లుగా నియమితులైన వారికి న్యాయ సేవలు, వివిధ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధులుగా వ్యవహరించా కూడా లన్నారు మరియు వారి ప్రాంతం లో ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ ఏ.గాయత్రి దేవి పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ వేదిక గా అందిస్తున సేవలు గురించి వివరించారు

న్యాయవాది మరియు ట్రైన్డ్ మీడియేటర్ పి. శ్రీనివాస రావు భారత రాజ్యాంగ విశిష్టత మరియు రాజ్యాంగ మౌలిక స్వరూపం మరియు ప్రవేశిక గురించి వివరించారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎస్.కే. జబీన గారు లేబర్ చట్టలు, అసంఘటిత కార్మికులు సంక్షేమం మరియు సామజిక భద్రత వంటి చట్టలు గురించి వివరించారు.

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం. లలిత కుమారి లింగ సమానత్వం, సమాన పనికి సమాన వేతనం వంటి చట్టలు గురించి వివరించారు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జె. మహేష్ ప్రాధమిక హక్కులు, లీగల్ సర్వీసెస్ చట్టం 1987 మరియు నల్సా వారి రేగులేషన్స్ గురించి వివరించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *