Breaking News

దళితులను ఆదుకోవాలి … : జిన్ని సువర్ణ రాజు

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపురం, పాలవాయి గ్రామ ప్రజలను ఏపీ ఏంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు  జిన్ని సువర్ణ రాజు కలిశారు. అక్కడి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కళ్యాణ్ దుర్గం మండలం పాలవాయి గ్రామం వాళ్ల స్థితిగతులు వ్యక్తిగతంగా ఆర్థికంగా మానసికంగా దళితులపై దాడులు, ఎడ్యుకేషన్  గురించి, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ సమస్యలు విని చలించి పాలవాయి గ్రామ ప్రజలకు ధైర్యాన్ని నింపి మీకు నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. తనకు పలికిన ఘన స్వాగతంలో తనమీద అభిమానంతో రక్తసిక్త మైన చేతులతో డప్పు వాయించిన దివ్యాయాంగుని యువకుడిని చూసి చలించి పోయానని తెలిపారు. గ్రామంలో తనకు హారతిపట్టిన ప్రతి అమ్మకు, అక్కకు, చెల్లికి రుణపడి ఉంటానన్నారు. అక్కడివారు శ్మశానవాటిక కూడా లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారన్నారు. తమపిల్లలు భావితరాల వారికి దారిచూపాలని కోరారని, గతంలో ఎందరో నాయకులు వచ్చారని మాటలు చెప్పి వారు అధికార పగ్గాలు చేపట్టారే తప్ప తమను పట్టించుకోలేదని చెప్పారన్నారు. చేతనైనంతలో ఏపీ ఏంఆర్పీఎస్, వివిధ శాఖల  ప్రభుత్వ అధికారుల సహాయసహకారాలతో దళితుల ఆదుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో మరిన్నిసేవా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జిన్ని సువర్ణ రాజుమాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఉప ప్రధానిగా, నాలుగు ద‌శాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా సేవ‌లు అందించి, కార్మిక‌, వ్యవ‌సాయ‌, ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌ల‌లో ఎన్నో సంస్కర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, ప్రజా నాయకుడిగా జగ్జీవన్ రామ్ ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోతారని తెలిపారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే జగ్జీవన్ రామ్ కి మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని పేర్కొన్నారు. ఆయన నడిచిన బాట, అనుసరించిన విధానాలు, చూపిన సంస్కరణ మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద ,దళిత, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *