Breaking News

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి శనివారం స్థానిక 24 వ డివిజన్ కొజ్జల్లి పేట, 50 వ డివిజన్ సుందరయ్య నగర్ లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు.100 రోజుల్లో కూటమీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆయా డివిజన్లో ఏర్పాటుచేసిన వార్డు సభల్లో మాట్లాడుతూ సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ,కూటమి ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన పథకాలు వివరించడంతోపాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 5 ప్రధాన అంశాలపై తొలి సంతకాలు చేశారని అన్నారు. పెంచిన 4 వేల పింఛను అందాయ? మొదటి నెలలో 7 వేలు పింఛను అందిందా? 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? మంత్రి ప్రశ్నించగా ఒకటో తారీకు ముందుగానే పింఛన్లు అందుకుంటున్నామని మహిళలు సంతోషంగా సమాధానం ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వమా కాదా అంటూ సబికులను మంత్రి ప్రశ్నించగా ఇది మంచి ప్రభుత్వం అంటూ ముక్తకంఠంతో ప్రజలు సమాధానం ఇచ్చారు.

పేదలకు, కార్మికులకు 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తూ రాష్ట్రంలో 100 అన్న క్యాంటిన్లను ప్రారంభించినట్లు తెలిపారు. పట్టణంలో జ్యువెలరీ పార్క్ ప్రాంతంలో మరో అన్న క్యాంటీన్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బుడమేరు వరదలకు ముంపునకు గురైన విజయవాడ నగరంలో సాధారణ స్థితి ఏర్పడే వరకు ముఖ్యమంత్రి ఎంతో శ్రమించారని, కష్టపడే ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం అన్నారు. వచ్చే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేసి ప్రజల ఆస్తులను కాపాడినట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా 16,500 పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

స్థానిక గోసంఘంలో ఈ నెలాఖరు నాటికి 223 మంది లబ్ధిదారులచే జి ప్లస్ త్రీ గృహప్రవేశాలు చేయించనున్నామన్నారు. 24 వ డివిజన్లో కొంతమంది జి ప్లస్ త్రీ గృహాలకు డబ్బులు కట్టినప్పటికీ ఇల్లు రాలేదని, కొంతమందికి కరగ్రహారం లేఅవుట్లో డి బ్లాక్ లో స్థలం వచ్చినా అది కోర్టులో ఉందని చెబుతున్నారని మహిళలు మంత్రికి తమ సమస్యలు తెలుపగా, పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు కేంద్ర సహాయంతో ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయలు అందిస్తామన్నారు.

50 వ డివిజన్లో సుందరయ్య నగర్ కాలనీ రోడ్డు విజయవాడ రోడ్డుకు కలిపే విధంగా చర్యలు తీసుకుంటామని, అరిసేపల్లి రోడ్డు కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో బందరు పోర్టు పనులు పూర్తి చేసి, షిప్ ల రాకపోకలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీపీసీఎల్ కంపెనీ 60 వేల కోట్ల పెట్టుబడులు రావడానికి ఎంపీ గారితో కలిసి ప్రయత్నిస్తున్నట్లు, ఇవన్నీ వస్తే బందరు ముఖచిత్రం మారిపోనున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకన్న, కుంచే నాని, లంకె నారాయణ ప్రసాద్, ఆయా డివిజన్ ల ఇన్చార్జి లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *