Breaking News

గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ మీడియా సంస్థల కధనాలు, ఫిర్యాదులపై గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాలికాధికారులతో కలిసి పరిశీలించామని, వారు పొందిన అనుమతి, జరుగుతున్న పనులను ప్రత్యక్ష్యంగా తనిఖీ చేశామని, జిఎంసి అధికారులు ఇచ్చిన షార్ట్ ఫాల్స్ పూర్తి చేసే వరకు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని జూలై 2024న ఇచ్చిన నోటీసు మేరకు నిర్మాణదారులు పనులు నిలిపివేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్ లో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత అపార్ట్మెంట్ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు, జరుగుతున్న నిర్మాణ పనులను మ్యాప్ ద్వారా పరిశీలించి, మీడియా కధనాల్లో వచ్చిన అంశాలను అధికారులు, బిల్డర్లను అడిగి తెలుసుకొని స్వయంగా కొలతలు తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ గ్రీన్ గ్రేస్ నిర్మాణం 2015లో ప్రారంభమైందని, తర్వాత మేనేజ్మెంట్ మారడం, నిర్దేశిత డాక్యుమెంట్లు జత చేయక పోవడం పై జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు షార్ట్ ఫాల్స్ నోటీసులు ఇచ్చారన్నారు. 2024 జూలైలో షార్ట్ ఫాల్స్ క్లియర్ చేసే వరకు నిర్మాణ పనులు నిలిపి వేయాలని ఫైనల్ నోటీసు ఇవ్వంద జరిగిందన్నారు. మీడియాలో కధనాలు వచ్చిన వెంటనే పట్టణ ప్రణాళికాధికారులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని, నివేదిక మేరకు క్షేత్ర స్థాయి నగరపాలక సంస్థ నుండి భవన నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులు, జరుగుతున్ననిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. పట్టణ ప్రణాళిక అధికారుల నివేదిక, తమ తనిఖీలో గమనించిన అంశాలను, చట్టపరంగా ఏమైనా అతిక్రమణలు జరిగాయా అని పరిశీలిస్తామన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, డిప్యూటీ సిటి ప్లానర్ మహా పాత్రో, ఏసిపి మురళి, టిపిఎస్ రిజ్వాన, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *