-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల…
-పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే, అధికారులు, స్థానిక యువత , గ్రామస్తులు
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం సాటిలైట్ సిటీ సి.బ్లాక్ కళ్యాణ మండపం నందు ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఆ సందర్భంగా శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య శాస్ర్తీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి జరిగిన వంద రోజుల్లో ఏం జరిగిందో జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వకం వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయాయన్నారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నిటిని గాడిలో పెడుతూ, కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని గాడిలో పెడుతొందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన మొట్టమొదటి పని పెంచి ఇస్తానన్న పెన్షన్ 3000 రూపాయల నుండి 4000 రూపాయలకి పెంచి ఏ నెల నుంచి అయితే ఇస్తాము అని అన్నామో ఆ మూడు నెలలుకి చెందిన మూడు వేలు కలిపి మొత్తం 7000 రూపాయలు అందించారఎన్నారై. గత ప్రభుత్వం మీ ఆస్తిపై హక్కులను హరిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చిందని, తద్వారా ఆస్తి హక్కు పత్రాలను ప్రభుత్వ తన స్వాధీనంలో ఉంచుకుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆస్తి హక్కులకు భంగం కలగకుండా యధావిధిగా కొనసాగించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసిందని అన్నారు.
నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియ చేశారు..పేదవాడికి ఐదు రూపాయలకే మంచి భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని, ఇది మంచి ప్రభుత్వాన్ని మనందరి ప్రభుత్వమని అన్నారు.
ఈ సాటిలైట్ సిటీ గ్రామం తన దత్తత గ్రామం అని, ఈ గ్రామానికి అన్ని వసతులు కల్పించి సుందర వనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఇప్పటికే అనేక పనులకు ఎస్టిమేట్ చేయడం జరిగిందని త్వరలో పనులు మొదలు పెడతామని తెలిపారు.
అంతకు ముందు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా పిడింగొయ్యి లోని. ఎస్ వి జి మార్కెట్ నుండి వి ఎల్ పురం వరకూ నిర్వహించిన స్వచ్ఛత హి సేవా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి , రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా గ్రామాలలో, మన పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం , పరిరక్షణ చర్యలు తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన చైతన్యం కలిగించే విధంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.. మన పరిసరాల్లో, మనం నివసించే ప్రాంతంలో పరిశుభ్రత పాటించడం మనందరి సామాజిక బాధ్యత అని శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తె.దే.పా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, మండల ప్రత్యేక అధికారి కే ఎన్ జ్యోతి, ఎం.పీ.డీ.వో డి.శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు వాసిరెడ్డి బాబి, దారా అన్నవరం, ఎమ్మెస్సార్ శ్రీను, బండారి సత్తిబాబు, నిచ్చనికోళ్ళ సత్తిబాబు, పెంకె కోటేశ్వరరావు, సరోజినీ దేవి, గెద్దాడ కృష్ణ, చౌడాడ లాజర్, బెంజిమెన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.