Breaking News

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 155కి పైగా చిత్రాల్లో తన డ్యాన్స్‌తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *