గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, 100 రోజుల ప్రజా పాలనను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం స్థానిక స్తంభాల గరువు మెయిన్ రోడ్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెన్షన్ ల పెంపు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకు అందించడం, మెగా డిఎస్సీ, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, రైతులకు గిట్టుబాటు ధర, బకాయిల చెల్లింపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి ప్రజోపయోగ, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి తమ 100 రోజుల పాలనలో అమలు చేశారన్నారు. విజయవాడలలో బుడమేరు గండి వలన ఏర్పడిన వరదలకు తీవ్ర నష్ట పోయిన నగర వాసులకు షుమారు 10 రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉండి, సహాయక, పునరావాస చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారన్నారు. నగరంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాల అమలుకు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ కమిషనర్లకు విధులు కేటాయించామన్నారు. అలాగే 206 వార్డ్ సచివాలయ కార్యదర్శులు పూర్తి స్థాయిలో పాల్గొనేలా పర్యవేక్షణకు 41 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. నగర ప్రజలు కూడా తమ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి తమ స్థానిక సమస్యలను కూడా తెలియచేయవచ్చన్నారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతి, సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియ చేయడానికి, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గత 100 రోజుల కాలంలో పీకల వాగులో సమగ్ర పూడికతీత, రోడ్ల మరమత్తులు, అన్న క్యాంటీన్లకు దాతల ద్వారా విరాళాలు, త్రాగునీటి సరఫరా మెరుగుకు కృషి చేశామన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను నగర కమిషనర్ దృష్టికి తెచ్చామని, త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, కార్పొరేటర్ వి.శ్రీరామ్ ప్రసాద్, కె.కోటేశ్వరరావు, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …