Breaking News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

-రైతులు నూతన ఆధునిక పద్ధతులు పాటించాలి
-ప్రతి రైతు ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించాలి
-రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు
-రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

చిన్నమండెం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నమండెం మండలం, మల్లూరు గ్రామంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి అభివృద్ధి చెందాలన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం మరియు బుధవారాలు ఉదయం ఒక గ్రామం సాయంత్రం ఒక గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 8:30 నుంచి 10:00 గంటల వరకు వ్యవసాయ క్షేత్ర సందర్శన, 10:00 నుంచి 12:00 గంటల వరకు గ్రామ సభ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు గ్రామసభ నాలుగు నుంచి 5:30 గంటల వరకు వ్యవసాయ క్షేత్ర సందర్శన చేయడం జరుగుతుందన్నారు. రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందజేసి ఆదుకోవడం జరుగుతుందని మరియు విత్తనాలు ఎరువులు సబ్సిడీతో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 80% సబ్సిడీతో రైతులకు మంత్రి చేతుల మీదుగా ఉలవలు పంపిణీ చేశారు. రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న తమకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *