Breaking News

వరద బాధితులలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సాయం అందించాలి

-కలెక్టర్ కు విన్నవించిన వైసీపీ నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులలో ఏఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజనను వైసీపీ నేతలు కోరారు. పశ్చిమ ప్రాంతంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసుల లాఠీఛార్జ్ నేపథ్యంలో.. వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆసిఫ్ సహా పలువురు వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ ను కలిశారు. ముంపు ప్రాంతాలలో నష్టం సేకరణ వివరాల సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా 38 వ డివిజన్లోని 119, 159, 194 వార్డు సచివాలయాలు సహా సెంట్రల్లోని పలు ప్రాంతాలలో సర్వే బృందాలు ఇప్పటివరకు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వరద తీవ్రతకు అనేక మంది వేరే ఊర్లలో తలదాచుకున్నారని.. కొంత మంది ఉపాధికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్పారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఎన్యుమరేషన్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. మరికొన్ని చోట్ల ఇంటికి వచ్చిన సర్వే బృందాలు నష్టాన్ని నమోదు చేసుకున్నా.. జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని, వాటన్నింటినీ సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరదలతో దాదాపు 5 వేల మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని.. వారందరినీ ఆదుకోవాలన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైన వాహనాలకు ఉచితంగా సర్వీసింగ్ చేయించేలా చూడాలన్నారు. అలాగే ముంపు ప్రాంతాలలో శానిటేషన్ మరీ అధ్వానంగా ఉందని.. ఇళ్ల ముందు పారవేసిన వస్తువులను పలుచోట్ల నేటికీ తొలగించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పలుచోట్ల త్రాగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని.. వాటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్థరించాలని విన్నవించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఒక ఆర్డీఓను ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు పంపించడంతోపాటు తాను కూడా స్వయంగా పర్యటిస్తానని తెలియజేశారు. అలాగే గడువు పొడిగింపు ప్రక్రియ తన చేతిలో లేదని.. ప్రభుత్వంతో మాట్లాడి ఆ దిశగా ప్రయత్నిస్తానని తెలియజేశారు.

Check Also

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *