న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ, 2024 ప్రచారానికి హాజరైన అశ్విని వైష్ణవ్

-పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత కోసం మంత్రిత్వ శాఖ అధికారులచే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి
-సూచనా భవన్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటిన అశ్విని వైష్ణవ్
-పరిసరాల పరిశుభ్రతకు సమాజ సేవా సంకల్ప ఆచరణ చాలా ముఖ్యం : అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా హి సేవ- 2024 ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఆధ్వర్యంలో స్వచ్ఛత, పర్యావరణ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు సూచనా భవన్‌లో జరిగిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సూచన భవన్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందితో మంత్రి ప్రమాణం చేయించారు, ఇందులో పాల్గొన్నవారు ఈ ప్రతిజ్ఞ ద్వారా తమ ప్రభావ పరిధిలో పరిశుభ్రత, ఆచరణీయ పద్ధతులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉండటమే లక్ష్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం) అనే ప్రచారానికి కొనసాగింపుగా, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే జమిలి లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ అశ్విని వైష్ణవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఉద్యోగులకు మొక్కలు పంపిణీ చేసి పర్యావరణం పట్ల వ్యక్తిగత బాధ్యతను నొక్కి చెప్పారు.

మంత్రితో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, మీడియా అధిపతులు ఉన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇతర విభాగాలు పెద్ద సంఖ్యలో అధికారులు/సిబ్బంది కూడా ఈవెంట్‌లలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *