-సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి
-రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం విట్టాపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ను నిర్వహించిన మంత్రి సవితమ్మ. విట్టాపల్లి గ్రామములో సీసీ రోడ్ ,మరియు డ్రైనేజీ నిర్మాణానికి 57 లక్షల రూపాయల నిధులతో భూమిపూజ నిర్వహించిన మంత్రి సవితమ్మ.
ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పధకాలను అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేసారు ఇళ్లకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరు ద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని, ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందజేస్తున్నామని అవ్వ తాతలకు 3000 ఉన్న పెన్షన్ 1000 పించి 4000 ఇస్తున్నామని, అలాగే పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంబించి ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివని తెలిపారు.గత ప్రభత్వంలో అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి రైతుల మేలు చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం ,జనసేన, బిజెపి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు