అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి విజ్ఞాపన పత్రం అందచేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో మూడేళ్ళ సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు అయిదేళ్లు చేయడమే కాకుండా, ఇన్ సర్వీస్ కోటాలో సీట్లు శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …