విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం వరద బాధితులకు నిత్యావసరులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. శనివారం బీసెంట్‌రోడ్డులోని ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా కార్యాలయంలో వరదల బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్‌కుమార్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇటీవల బుడమేర వరదల వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితులలో ఎంతో మంది సహకారాలు అందజేస్తున్నారు అందులో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వరదబాధితులకు సంబంధించిన సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వరద ఏర్పడిన మరునాటి నుండే ఎల్‌ఐసి ఉద్యోగ సంఘంగా వారి దగ్గరకు వెళ్ళి ఎవరికి సహాయం కావాలన్నా వారి సహాయం అందజేయడం జరుగుతుంది. పులిహార ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్లతో ప్రారంభమైన కార్యక్రమాలు ఈ రోజు చీరలు, దుస్తులు, ఇంట్లో ఉపయోగపడే వస్తువులు, నిత్యావసర వస్తువులు, పిల్లలకు పుస్తకాలు అందజేయడం మెడికల్ క్యాంప్‌లు నిర్వహించడం ఒక్కొక్కటి చేసుకుంటూ మావంతు కృషి చేస్తున్నామన్నారు. అనేక ప్రాంతాలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊర్మిళానగర్, కండ్రిక, సింగ్‌నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరీపేట ఇలా పలు ప్రాంతాలలో మొదట్లో ప్రత్యేకంగా వారి కోసం టెంట్‌లు ఏర్పాటుచేసి అల్పాహారం, భోజన సదుపాయాలు ఏర్పాటుచేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 3 వేలకు పైగా ప్రజానీకానికి వివిధ రూపాల్లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో 4, 5 వేల మంది వారికి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే వారికి గుర్తించి టోకెన్లు ఇచ్చి వారికి కావలసిన సహాయాన్ని బాధ్యత కలిగిన ఒక ట్రేడ్ యూనియన్‌గా ఉద్యోగ సంఘంగా ప్రజలలోకి వెళ్ళి చేయడం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి నుంచి విపత్తుల సంబంధించిన సమయంలో సహాయం చేయమని చెప్పడం అది ఉదుత్ తుఫాన్, కరోనా వంటి భయంకర పరిస్థితులలో బాధితులకు సహాయ సహకారాలు అందించడం ఉద్యోగ సంఘంగా మా వంతు బాధ్యతను సమాజంలో నిర్వర్తిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్ వరదల బాధితులకు మరిన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే ఎల్‌ఐసిలో వివిధ శాఖల ఉద్యోగుల సమస్యల విషయంలో కూడా ప్రభుత్వాలు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జె.సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.మూర్తి, జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …