పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు పాలకొల్లులో వైయస్సార్ సిపి నాయకురాలు, న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కర్ర జయ సరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్ర జయ సరిత మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అభివృద్ధిని జెట్ స్పీడ్ వేగంతో పరుగులు పెట్టించి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన సంక్షేమ రారాజు పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీనవర్గాల పాలిట దేవుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. మహనేత పుట్టిన రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం అ మహనీయినికి మనం ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు, పేదలకు ఇల్లు, విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో యువతకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ, కార్మికులకు మహిళలకు ఆర్థికంగా ఆదుకుంటూ నవరత్నాలు అందిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఓసి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందన్నారు. మహనేత అశయాలను యువనేత జగన్మోహనరెడ్డి కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మనమందరం ఆయన అడుగుజాడలలో నడవాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Tags palakollu
Check Also
డిసెంబర్ 22 న ఏపీపీఎస్సీ శాఖ పరమైన పరీక్షలు
-కంప్యూటరుపరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి -పరీక్షలకు హాజరుకానున్న 249 మంది ఉద్యోగులు -డి ఆర్ వో టి సీతారామ మూర్తి …