విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి, మెలిసి జీవించాలని బైబిల్ లో ఉందని వరల్డ్ హీలింగ్ డే రాష్ట్ర కో ఆర్డినేటర్ మేదర సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ హీలింగ్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేదర సురేష్ కుమార్ మాట్లాడుతూ 148 దేశాలు ప్రపంచ పుస్తక దినోత్సవం ని జరుపుకుంటూ మానవులందరూ కలిసిమెలసి జీవించాలని ఇప్పుడున్న ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు కొన్ని వ్యాధుల వలన ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం వారి కుటుంబాలకు స్వస్థత చేకోరాలని ఏసుప్రభు బోధించారని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు అనుసరించడం వల్ల కుటుంబానికి ప్రేమ, కుటుంబ ఐక్యత , శాంతి ప్రేమ కరుణ కలిగి ఉంటారని అన్నారు. బిషపు మంగళ పూడి జోసఫ్, పాస్టర్ మరియదాసు, బాబు, పిల్ల వెంకట తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …