Breaking News

పేద ప్రజల సంక్షేమ పథకాల సంక్షేమ రారాజు వైయస్సార్… : కర్ర జయ సరిత

పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు పాలకొల్లులో వైయస్సార్ సిపి నాయకురాలు, న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కర్ర జయ సరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్ర జయ సరిత మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అభివృద్ధిని జెట్ స్పీడ్ వేగంతో పరుగులు పెట్టించి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన సంక్షేమ రారాజు పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీనవర్గాల పాలిట దేవుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. మహనేత పుట్టిన రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం అ మహనీయినికి మనం ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు, పేదలకు ఇల్లు, విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో యువతకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ, కార్మికులకు మహిళలకు ఆర్థికంగా ఆదుకుంటూ నవరత్నాలు  అందిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఓసి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందన్నారు. మహనేత అశయాలను యువనేత జగన్మోహనరెడ్డి కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మనమందరం ఆయన అడుగుజాడలలో నడవాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *