Breaking News

పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం: హోంమంత్రి వంగలపూడి అనిత

-నారా భువనమ్మ పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదాం : హోం మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళారూపాలకు పెద్దపీట వేయాలన్నారు. మన కుటుంబంతో పాటు మన ఇంట్లో ఆనందంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ సంతోషం నింపాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *