తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభంనకు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపం నందు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ తో పాటు కమిషన్ సభ్యులు త్రిపర్ణ ఆదిలక్ష్మి, బి పద్మావతి ఉన్నారు. వీరితో పాటు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, డిసిపిఓ శివ శంకర్ ఉన్నారు.
Tags tirumala
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …