Breaking News

పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ అందించేలా సీడ్ యాప్ ద్వారా శిక్షణ

– సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ కార్యాలయం లో చైర్మన్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఎంపిక చేసిన 20 మంది చైర్మన్లతో ముఖ్యమంత్రి మాట్లాడి లక్ష్యాలను నిర్ధేశించారన్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారని, అందుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. సీడ్ యాప్ సంస్థ ద్వారా పరిశ్రమలకు కావాల్సిన శిక్షణను యువతకు ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం తో లింక్ అప్ అయిన పథకాలు అనేకం ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఏపీ సీడ్ యాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లు ద్వారా యువతకు శిక్షణ అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభివృద్ధి దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన మాన్ పవర్ ను అందిస్తామని, సెక్టర్ల వారీగా పరిశ్రమల వారితో చర్చిస్తామన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న పథకాలకు ఎటువంటి నిధుల కొరత లేకుండా తప్పక కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుంగా కృషి చేసి అభివృద్ధి చేస్తానన్నారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఎల్ సీ బీటీ నాయుడు, సీడ్ యాప్ సీఈవో ఎం.కే.వీ. శ్రీనివాసులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

హ‌స్త‌క‌ళాభిమానుల‌ను అల‌రించ‌నున్న లేపాక్షీ గాంధీ శిల్ప్ బ‌జార్

– ఈ నెల 22 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాలు. – ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *