విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోతిన మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో రాజా నాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త అయిన నాకు అసెంబ్లీ స్థానం కేటాయించి, తదుపరి విజయవాడ నగర అధ్యక్షులు గా బాధ్యతలు కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతనని, అధికార పార్టీ నాయకుల అవినీతి పై పోరాటం చేసేందుకు నిరంతరం ముందుంటానని తెలియజేశారు అదే విధంగా ప్రత్యేకంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్.గయసుద్దిన్, మల్లెపు.విజయలక్ష్మి, లింగం.శివప్రసాద్, తమ్మిన లీలాకరుణాకర్, హెచ్ డి ఎఫ్ సి శివ , మురళి కృష్ణ, దార రాంబాబు, రామానాయుడు, పండు, రాము, కార్తీక్, విశ్వనాథ్ , తోట సాయి, రాధా కిరణ్, దుర్గారావు, సుభాని తదితరులు పాల్గొన్నారు.