మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 2 వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు లతో కలిసి మంగళవారం వేకువ జామున నుండి నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు.
తొలుత మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో కలిసి నేషనల్ డిగ్రీ కళాశాలలో హెలిపాడ్ ఏర్పాట్లు, కళాశాల బయట రహదారి వెంబడి చెత్తాచెదారాలను, తదుపరి డంపింగ్ యార్డ్ ను, మూడు స్తంభాల సెంటర్, కోనేరు సెంటర్ మీదుగా లేడీస్ క్లబ్, టిటిడి కళ్యాణ మండపం, రైతు బజారు,సుందరయ్య నగర్, ముస్తా ఖాన్ పేట తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోకల గురించి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ఎస్పీతో చర్చించారు. కళాశాలలో గడ్డి మొక్కలను తొలగించాలని, హెలిప్యాడ్, కళాశాల ఆవరణ అంతా ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలని, కళాశాల బయట రహదారి మార్గంలో గుంతలు లేకుండా సరిచేయాలని, జిల్లా కలెక్టర్ సంబంధిత మునిసిపల్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో మంత్రి కలెక్టర్ ఎస్పీ వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావు అదనపు ఎస్పీ బివిడి ప్రసాద్ డిఎస్పీ సుభాని, మచిలీపట్నం, పెడన ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాల్ రావు వెంకటేశ్వరరావు, కళాశాల కరస్పాండెంట్ పి కుటుంబరావు, ఘన వ్యర్థాల నిపుణులు ఉదయ్ సింగ్, జిల్లాగ్రంథాలయ సంస్థ మాజీచైర్మన్ గొర్రెపాటి గోపీచంద్,మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్,తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.