-పొట్టి శ్రీరాములు హైస్కూల్ సందర్శన
-ఎమ్మెల్యే గద్దె తో కలిసి గ్రౌండ్ పరిశీలిన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధులకి క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్తులో వారు ఎన్నో విజయాలు అందుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడాభివృద్దికి నడుం బిగించారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హైస్కూల్ లోని క్రీడా వికాస కేంద్రాన్ని, స్కూల్ గ్రౌండ్ ను పూర్తిగా పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోమన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తో కలిసి సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. గ్రౌండ్ లో క్రికెట్ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను పలకరించారు. అలాగే వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులతో మాట్లాడారు. గ్రౌండ్ అభివృద్దికి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. వాకర్స్ తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు హైస్కూల్ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. అలాగే గ్రౌండ్ లో క్రికెట్ సబ్ సెంటర్ ఏర్పాటు కి కావాల్సిన సదుపాయాలపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాఫ్ చైర్మన్ అంకం చౌదరి, హైస్కూల్ పి.డి వేమూరి రవికాంత, అమరావతి వాకర్స్ ప్రెసిడెంట్ మోరం లక్ష్మయ్య, కృష్ణ లంక వాకర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ నిమ్మల జ్యోతిక
, నిమ్మల దుర్గారావు, దమ్మాలపాటి రంగరావు, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరిపర్తి నామేశ్వరరావు , 21 డివిజన్ ప్రెసిడెంట్ వేములపల్లి రంగారావు, జనసేన పార్టీ నాయకులు పోతిరెడ్డి రమణ, వన్ టౌన్ గోల్డ్ యూనియన్ ప్రెసిడెంట్ కేశనం శివ భవన్నారాయణ ,టిడిపి జిల్లా వాణిజ్య విభాగం నాయకులు పెరుమళ్ళ గురునాథం , టిడిపి నాయకులు కొడాలి సాయిబాబు , పుప్పాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.