-కృష్ణా జిల్లా అధికారులు,మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
-రేపు బందరు లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ
-అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు
-మచిలీపట్నం కలెక్టరేట్ లో మీడియాతో మంత్రి నారాయణ కామెంట్స్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు నిర్వహించే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం రానున్నారు. నగరంలో పలు చోట్ల ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది..దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం వచ్చిన మంత్రి….ముందుగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో పురపాలక శాఖ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,సీఎం కు వివరించాల్సిన అంశాలపై చర్చించారు. అక్కడినుంచి నేషనల్ లా కాలేజీలో సీఎం హెలికాప్టర్ కోసం ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ను పరిశీలించారు. అక్కడి నుంచి కళాశాల బయట సీఎం పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలన తర్వాత డంపింగ్ యార్డు ను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి…ఇక్కడ సీఎం చంద్రబాబు సఫాయి కర్మచారి పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి తర్వాత వారికి దుస్తులు, పారిశుధ్యం కోసం వినియోగించే రక్షణ పరికరాలు అందజేస్తారు. ఆయా ప్రాంతాల పరిశీలన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు మంత్రి నారాయణ. ఈ సమావేశంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హరి నారాయణన్,మెప్మా ఎండీ తేజ్ భరత్,పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ,జాయింట్ కలెక్టర్,ఎస్పీ గంగాధర్ రావు తో పాటు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష తర్వాత మీడియా తో మాట్లాడారు మంత్రి.
సీఎం పర్యటన ఏర్పాట్లు విజయవంతం చేయండి
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నారు..నగరంలో సీఎం పలు ప్రాంతాల ను పరిశీలించనున్నారు.ముందుగా హెలికాప్టర్ లో ఉండవల్లి నివాసం నుంచి నేరుగా నేషనల్ లా కాలేజీ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద సీఎం చంద్రబాబు చేరుకుంటారు..అక్కడే కళాశాల బయట భారీగా విద్యార్దులు తో ఏర్పాటు చేసిన స్వచ్ఛత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని…అక్కడినుంచి డంపింగ్ యార్డు ను పరిశీలించిన తర్వాత టీటీడీ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మచిలీపట్నం కార్పొరేషన్ లో గత టీడీపీ ప్రభుత్వంలో అమృత్ – 1 స్కీం ద్వారా 36 కోట్లతో ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని…అమృత్ 2.0 లో 71 కోట్లతో పనులు చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు మంత్రి.అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం తో పనులు ముందుకు సాగలేదన్నారు. 2020 వ సంవత్సరంలో 2290 కోట్ల నిధులను కేంద్రం కేటాయించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 శాతం నిధులు ఇవ్వకపోవడం తో కేంద్రం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం తో మాట్లాడి నిధులు విడుదల చేయించాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే6 నెలల్లో అన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. వచ్చే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు అందిస్తామన్నారు.
పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము
రాష్ట్రంలో వరద నీటి కాలువల ఆక్రమణల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు మంత్రి నారాయణ. బుడ మేరు ఆక్రమణల తోనే విజయవాడకి భారీ వరదలు వచ్చాయి..అందుకే ఆపరేషన్ బుడ మేరు చేపట్టాం..రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడ మేరు తరహాలో అక్రమ కట్టడాల పై ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు,చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు.అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా,ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి.అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తామన్నారు..ఏ పేదవారిని ఇబ్బంది పెట్టేది లేదన్న మంత్రి….అలాంటి వారికి టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. పేదల ను సంతృప్తి పరిచిన తర్వాతనే ముందుకెళ్తామన్నారు మంత్రి.. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.