అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 24, 2024 న జరిగిన భారీ వర్షాలు మరియు వరదల సమయంలో, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో15 సంవత్సరాలుగా నివాసం ఉంటూ సాయిరాం కేటరింగ్ నిర్వహిస్తున్న fishermanboat సొసైటీ బృందం (రవికుమార్, కర్రి పోసయ్య, కర్రి నాని, మల్లాది చరణ్, వినోద్) మానవతా దృక్పథంతో తమ ప్రాణాలను పణంగా పెట్టి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బంది పడుతున్న వృద్ధ మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు బోట్ల ద్వారా తరలించారు. బుడితి రాజశేఖర్ IAS, ప్రత్యేక వ్యవసాయ ప్రధాన కార్యదర్శి (వ్య.&సహకారం)మరియు ఎస్. డిల్లిరావు IAS, డైరెక్టర్వ్యవసాయ శాఖ, వారి ప్రేరణతో రవికుమార్ మరియు ఇతరులు ఈ మహత్తర సేవ చేయగలిగింది. విపత్తు సమయంలో ప్రత్యేకాధికారులుగా ఉన్న బుడితి రాజశేఖర్ వారు వరద సహాయక బృందం ధైర్యం, సేవా కార్యక్రమాన్ని గుర్తించి అభినందించారు. వారి సేవా తతంగం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. వారి ధైర్యం, సాహసం గుర్తించి, ప్రత్యేక వ్యవసాయ ప్రధాన కార్యదర్శి వారు సచివాలయంలో తన చాంబర్‌లో రవికుమార్ బృందాన్ని సన్మానించారు.
Tags amaravathi
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …