మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ సాగర్ సుందర్ సాగర్ నినాదం తో క్లీన్లినెస్ ఆఫ్ బీచెస్ లొ ఈరోజు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరన స్వచ్ఛతాహి సేవ ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరి చేత గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలవేసి చేసిన సేవలను కొనియాడారు అనంతరం స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ మరియు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం 2014లో మోడీ గారు ద్వారా మొదలైందని అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఇది అమలవుతుందని కృష్ణాజిల్లాలో అనేక ప్రాంతాలలో నెహ్రూ యువ కేంద్రం సభ్యులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా బాగుందని ఈ ప్రోగ్రాం లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భాగం అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు
నెహ్రూ యువ కేంద్ర జిల్లా యవజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండు వరకు జిల్లాలో అనేకచోట్ల ఈ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం కార్యక్రమాలు చేస్తూ వచ్చామని ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మంగినపూడి బీచ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మరియు
సముద్రాలను మంచినీటి సరస్సులను ప్లాస్టిక్ వ్యర్ధాల తొ పాడు చేస్తున్నామని సముద్రం దగ్గర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను నిర్మూలించడం ద్వారా సముద్ర జీవులకు మరియు ప్రజల కు చాలా మేలు జరిగుతుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో మరొక అతిథి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఫణి ధూర్జటి మాట్లాడుతూ అడవులు, పర్యావరణం సమతుల్యతను ప్లాస్టిక్ వ్యర్ధాలు దెబ్బతీస్తున్నాయని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువుల దూరంగా ఉండాలని కోరారు
కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటింగ్ అఫీలేటెడ్ మెంబర్ బి వినోద్ కుమార్ జిల్లా యువజన సంక్షేమ శాఖ మేనేజర్ సుబ్బారావు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ టి బాలాజీ, ధనేకుల కాలేజీ ప్రిన్సిపల్ కె రవి, రెడ్ క్రాస్ సెక్రటరీ భవిరి శంకర్ నాధ్ ఐక్యం ఫౌండేషన్ శ్వేత ఆకూరి, థనేకుల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు 250 మంది మరియు ఎన్వైకే వాలంటీర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు అందరికీ మై భారత్ కిట్ను ఇవ్వడం జరిగింది మరియు సుమారు 600 కేజీ ల ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించిన జరిగింది.