ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ను పేదరికరహిత స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ కు ప్రతీ ఒక్కరూ మంచి సూచనలు అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడంపై గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ తో హైదరాబాద్ నగరానికి ప్రపంచపఠంలో గుర్తింపు తెచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో దేశంలోనే ముందుస్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విజన్ కు ముఖ్యమంత్రి అన్ని రంగాలలో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో ప్రధమ స్థాయిలో నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ రూపొందించడంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆలోచనలను పరిగణనలోనికి తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్ర గా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కృషి కి అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించి అత్యంత ఉత్తమమైన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సహకరించాలన్నారు. స్వర్ణాంధ్ర-2047 క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి, అందులో సూచించిన అభివృద్ధి సూచిక అంశాలలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. అధికారులు, ప్రజల ఆలోచనలతో స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ రూపుదిద్దుకుంటుందన్నారు. 2019 కి ముందు ఇదే విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, పారిశ్రామికంగా అభివృద్ధిపధంలో నిలిపి రాష్ట్ర వృద్ధిరేటు ను పెంచడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చంద్రబాబునాయుడు 72 శాతం పూర్తి చేస్తే, గత ప్రభ్జుత్వం అస్సలు పట్టించుకోలేదన్నారు. అదేవిధంగా అమరావతి ప్రపంచస్థాయి రాజధాని రూపకల్పన చేస్తే దానిని కూడా ముందుకు తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించలేకపోయారన్నారు. గత ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాలు కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుదేలైపోయిందన్నారు. అందుకే ప్రజలు తమ భావనను ఎన్నికలలో తెలియజేసి, విజన్ గల నాయకుడు చంద్రబాబునాయుడు ఒక్కరే అని నమ్మి ఘన విజయాన్ని అందించారన్నారు. గత 5 కాలంలో ఆర్ధిక అవకతవకలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి పై ఎటువంటి విజన్ ఆలోచన లేని నాయకత్వం కారణంగా ప్రజలు ఎంతో నష్టపోయారన్నారు. 10. 5 లక్షల కోట్ల అప్పులు, వాటిపై వడ్డీలు గత ప్రభుత్వం సాధించిన ఘనతలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి ఆవాస యోజన, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదని , వాటికి రాష్ట్ర ప్రభుత్వము కొంతమేర అందించవలసిన మాచింగ్ గ్రాంట్ లను గత ప్రభుత్వం విస్మరించడంతో కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోయామన్నారు. ఏలూరు జిల్లా విజన్ డాక్యుమెంట్ చక్కగా రూపొందించారని, అదేస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యే లు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా. కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, జిల్లా అటవీశాఖాధికారి రవీంద్ర దామా, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags Eluru
Check Also
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం
-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …