Breaking News

రక్షిత త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-కార్పొరేటర్ బుల్లా విజయ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి )ఆదేశాల మేరకు పశ్చిమ లో సురక్షిత త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ అన్నారు. గాయత్రి నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్, మరియు స్మిత్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుల్లా విజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా సర్వే చేసి సురక్షిత తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పశ్చిమంలో 22 డివిజనన్లు ఉండగా 11 డివిజన్లు కొండ ప్రాంతంలో ఉన్నాయని వారికి అనేక దశాబ్దాలుగా త్రాగునీరు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందుకొచ్చారన్నారు. పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్, స్మిత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో విజయవంతమైన ఈ పైలెట్ ప్రాజెక్టును పశ్చిమ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా పశ్చిమ ప్రజలకు 24 గంటలు సురక్షిత మంచినీటిని అందజేయవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా సౌర విద్యుత్తు వినియోగాన్ని విస్తరించడం ద్వారా సామాన్య పౌరులపై కరెంటు చార్జీల భారం తగ్గుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఈ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించడానికి, మరింత విస్తృతం చేయడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాతబస్తీని కొత్తగా తయారు చేయడానికి ఆయన కట్టుబడి ఉన్న రన్నారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడుతూ పశ్చిమ ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి పైలెట్ ప్రాజెక్టు ను ప్రారంభించడం సంతోషకరమైన విషయం అన్నారు. కోయంబత్తూర్ లో విజయవంతమైన ఈ ప్రాజెక్ట్ పశ్చిమ నియోజకవర్గం లో కూడా పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని తద్వారా రక్షిత తాగునీటిని అందించవచ్చు అన్నారు. గత వారం రోజులు గా చిట్టినగర్ లోని ప్రైజర్ పేటలో పైలెట్ ప్రాజెక్టు బృందాలు పరిశీలన చేస్తున్నాయని అన్నారు.మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయి పరిశీలన తర్వాత మరిన్ని వివరాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రామన్ రఘునాథన్, స్మిత్ కంపెనీ ప్రతినిధి దామోదర్, సుజనా ఫౌండేషన్ టెక్నికల్ అడ్వైజర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *