విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్.రమేష్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. శనివారం విద్యాధరపురం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా ఎమ్.రమేష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కామకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐ.ఆర్. మంజూరుచేసి, సి.ఆర్.సి. కమీషను హైకోర్టు బ్లడ్జ్/విశ్రాంత బడ్జ్ నేతృత్వంలో ఏర్పాటుచేసి మాతన సంవత్సరం (2025 ఉగాది) వాటికి పి.ఆర్.సి. అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా మరియు గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్యత్తు నిధి (జి.పి.ఎఫ్) నుండి కోట్ల రూపాయలు ప్రభుత్వం అక్రమంగా దారిమళ్ళించిన విషయంలో దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి నివేదించుటకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్లు తెలియచేశారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీపఠాన్, సంఘ సలహామండలి చైర్మన్ చొప్పా రవీంద్రబాబు, ఎ.పి.జి.ఇ.ఎ. అనుబంధ పెన్షన్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రరావు నూతనంగా ఎన్నికకాబడిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎమ్.రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.నాగసాయి, రాష్ట్ర ట్రెజరర్ టి.వి.ఎస్. రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజ్‌కుమార్, ఎన్.లక్ష్మీపతి, బి.సుగుణ, సి.హెచ్.వెంకటేశ్వరరెడ్డి, సి.హెచ్. పాపారావు, రాష్ట్ర కార్యదర్శులు తిరుపతిరావు, భూపతిరాజ్ రవీంద్రరాజ్, జి.కిషోర్‌కుమార్‌లతో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News