– సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలకు ఎంపిక చేసిన లేఅవుట్లో మెరక, స్టోన్ ప్లాంటేషన్ పనులు జూలై 16వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. గురువారం జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు లేఅవుట్లను సంబంధిత అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలగ లేరులో 179.14 ఎ కరాలు, హెచ్.ముత్యాలంపాడు 78.79 ఎ కరాలు, సున్నంపాడు, మునగపాడులలో 123 ఎ కరాలు, కొండపల్లిలలో 110 ఎ కరాల లేఅవుట్ లలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈలేఅవుట్ లలో మెరక, స్టోన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసేందుకు సర్వేయర్లు, విఆర్ఓలు సమన్వయంగా పనిచేయాలని ఇందుకు సంబంధిత తహశీల్దార్లు, యంపిడిఓలు పర్యవేక్షించి పనులు యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి అయ్యేలా చూడాలన్నారు. సబ్ కలెక్టరు వెంట తహశీల్దార్లు ఇంతియాజ్ పాషా, సూర్యారావు తదితరులు ఉన్నారు.