-డివిజన్ పరిధిలో 126 ఆర్ ఎస్ కె లలో కొనుగోలు కేంద్రాలు
-జెసి ఎస్.చిన్న రాముడు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంలో భాగంగా రైతులతో, రైస్ మిల్లర్స్ తో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ వారి కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై సమన్వయ సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి గణనీయంగా వస్తుందని అంచనాకు రావడం జరిగిందన్నారు. అందుకు అనుబంధంగా జిల్లాల్లోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
రైతులు గత సీజన్లో ఎదుర్కొన్న సమస్యలు మిల్లర్స్ తో కలిసి చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందన్నారు. రైతులు, మిల్లర్లు యాజమాన్యం, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సమర్ధవంతంగా నిర్వహించేందుకు రైతులు, మిల్లర్లు యాజమాన్యం, వ్యవసాయ అధికారులు సమన్వయంతో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 4 లక్షల మెట్రి క్ టన్నులు ధాన్యము రైతులు పండించు చున్నారన్నారు .వీటిలో సన్నబియ్యం ఎగుమతి చేయ గా 2.5 లక్షలు మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించుకునేందుకు గాను సమన్వయ శాఖల అధికారులతో, మిల్లర్ల తో కూడి ఈసమావేశము ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి. రాధిక మాట్లాడుతూ ఈ సంవత్సరములో ధాన్యం కొనుగోలు మార్పులు చేయడం జరిగిందని రైతులు తమకు నచ్చిన మిల్లుకు రైతులు తమ ధాన్యమును పంపవచ్చునని తెలిపారు. ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ . నాగాంజనేయులు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులుకు అవసరమై న గోను సంచులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్ ఎస్ కె వారీగా పంట దిగుబడి అంచనా వేసి అందుకు అనుగుణంగా రైతులకు కావలసిన గోను సంచులను సకాలంలో రైతులు అందించడం జరుగుతుందని తెలిపారు.
రెవెన్యూ డివిజన్ అధికారి.డాక్టర్ రాణి సుస్మిత, మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలులో ఏదైనా ఇబ్బం దు లు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లైతే వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెవిన్యూ డివిజనల్ స్థాయి లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆర్ ఎస్ కె వద్ద నియమ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీ లని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్ర మును సందర్శించి ధాన్యం కొను గోలు కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత గ్రామ వ్య వసాయ సహాయకులుని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక, ఇన్చార్జి డిఎస్ఓ ఎం నాగాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఏడి, పి. చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏవోలు,రైతులు, రైస్ మిల్లర్స్, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.