Breaking News

అరకులోని బొర్రా గుహలను సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్

-ప్రకృతి రమణీయతకు అల్లూరి సీతారామరాజు జిల్లా నెలవని పేర్కొన్న మంత్రి
-అటవీ శాఖతో సమన్వయం చేసుకొని పర్యాటక అభివృద్ధి చేపడతామని వెల్లడి
-నిర్లక్ష్యానికి గురైన రిసార్ట్స్ ను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని హామీ
-గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని విమర్శ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విశాఖ పర్యటన అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను సందర్శించారు. త్వరలోనే పర్యాటక సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో స్థానికంగా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే, మంత్రముగ్దులను చేసే పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖపట్టణంలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన యాత్రి నివాస్, ఇతర పర్యాటక కేంద్రాలను సందర్శించిన అనంతరం కూటమి నేతలతో కలిసి టైడా ప్రాంతంలోని జంగిల్ బెల్స్ లో అభివృద్ధి పనులను పరిశీలించానన్నారు. గత ప్రభుత్వ అక్రమాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల అద్భుతమైన జంగిల్ బెల్స్ రిసార్ట్స్ ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై విమర్శల మీద పెట్టిన దృష్టి పర్యాటకం మీద పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ రిసార్ట్స్ ఐదేళ్ల నిర్లక్ష్య పాలనకు సాక్ష్యంగా నిలిచాయన్నారు. రిసార్ట్స్ లో రూమ్స్ పాడయ్యాయని, నివాసానికి అనుగుణంగా లేకుండా పోయాయన్నారు. పర్యావరణ పర్యాటకానికి ప్రాధాన్యతనిచ్చే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. పర్యాటకాన్ని పట్టించుకోకుండా గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేశారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *