Breaking News

అగ్గిపెట్టెల‌కు, కొవ్వోత్తులకు రూ.23 కోట్లు అనేది అస‌త్య ప్ర‌చారం

-ఆ నిధులు ఖ‌ర్చు పెట్టించి మొబైల్ జ‌న‌రేట‌ర్ల‌కు
-కొంద‌రు కావాలనే సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం చేస్తున్నారు
-ఇలాంటి ప్ర‌చారాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
-ప్ర‌భుత్వ రెవెన్యూ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ.23 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని సామాజిక మాధ్యమాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ప్ర‌భుత్వ రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా ఒక ప్ర‌క‌ట‌న‌లో ఈ ప్ర‌చారాల‌ను ఖండించారు. అవ‌న్నీ ఫేక్ ప్ర‌చారాల‌ని కొంత‌మంది ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డం కోసం, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడం కోసం ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. వ‌ర‌ద‌ల కార‌ణంలో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక రాత్రిళ్లు ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డార‌ని, వారికి రాత్రిళ్లు ఇబ్బందులు త‌లెత్త‌కుండా మొబైల్ జ‌న‌రేట‌ర్లు త‌ల‌రించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు చేస్తున్నట్లుగా కేవ‌లం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి రూ.23 కోట్లు వెచ్చించామ‌న‌డం పూర్తీగా నిరాధార‌మైంది, అస‌త్య ప్ర‌చార‌మ‌న్నారు. ఈ ఖ‌ర్చు ప్ర‌ధానంగా మొబైల్ జ‌న‌రేటర్ల కోసం వెచ్చించింద‌న్నారు. దీంతో పాటు వ‌ర‌ద బాధితుల‌కు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అద‌నంగా అందించామ‌ని స్ప‌స్టం చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ఇలాంటి ప్ర‌చాల‌ను ప్ర‌జ‌లు ఏమాత్రం విశ్వ‌సించ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *