Breaking News

ఆలయ ఈవో కె ఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు

-అనదికార దర్శనాల కట్టడికి చర్యలు
-వృద్దులు, వికలాంగుల వసతుల క్షేత్ర స్థాయి పరిశీలన
-ఏర్పాట్లపై భక్తులతో అభిప్రాయ సేకరణ
-సంతృప్తి వ్యక్తపరచిన భక్తులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవములు సందర్బంగా ఇంద్రకీలాద్రి పై జగన్మాత ను దర్శించుకొనుటకు వివిధ ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈరోజు అనగా తేదీ 06.10.2024 న 4 వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా ఉదయం 3 గం. ల నుండి భక్తులు విశేషముగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో కె ఎస్ రామారావు భక్తులకు అందుచున్న పలు ఏర్పాట్లుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగముగా ఈవో క్యూలైన్ లలో టికెట్ లు పరిశీలించారు. స్కానింగ్ పాయింట్ వద్ద నిలబడి టికెట్లు మరియు పాస్ ల QR కోడ్ ను స్కాన్ చేసి తనిఖీ లు నిర్వహించారు. ఇటీవల వృద్దులు, దివ్యాంగులు మరియు నడవలేని వారికోసం ఏర్పాటు చేసిన stair case lift ను స్వయముగా పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు స్వీకరించగా వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *