Breaking News

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

-పాలు, మజ్జిగ, మంచినీళ్లు నిరంతరం సరఫరా.
-వేగంగా కదులుతున్న క్యూలైన్లు
-సీఎం చంద్రబాబు ఆదేశాలతో పటిష్టమైన ఏర్పాట్లు
-నిరంతర పర్యవేక్షణలో దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కలెక్టర్ డా. సృజన, ఈవో రామరావు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా దేవి దసరా మహోత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. నాలుగో రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లో పసిబిడ్డలతో వచ్చే భక్తులకు వేడివేడి పాలు సరఫరా చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లను, మంచినీరు బాటిల్స్ అందిస్తున్నారు. క్యూలైన్లో చంటి బిడ్డను చూసిన వాలంటీర్లు అడిగి మరీ వేడి వేడి పాలు అందిస్తున్నారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ ఆదేశాలతో క్యూలైన్లో అవసరమైన చోట ఫ్యాన్లు ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక మార్గాన వీల్ చైర్ లో వికలాంగులను, వృద్ధులను వాలంటీర్లు సహాయంతో లోపలికి తీసుకుని వెళ్లి అమ్మవారి దర్శనం చేయించి తిరిగి వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు. వృద్ధులు వికలాంగులను ప్రత్యేకమైన వాహనాలలో కొండమీదికి తీసుకువచ్చి దర్శనం చేయించి తిరిగి సౌకర్యంగా పంపేలా ఏర్పాట్లు చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విఐపిలు వస్తున్నప్పటికీ సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ఆగకుండా ఏర్పాట్లు చేయాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు రాజశేఖర్ బాబు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఏమైనా అసౌకర్యాల కలుగుతున్నాయా.. కలిగితే వాటిని ఎలా పరిష్కరించాలి అనే కోణంలో ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నారు. ఆలయ ఈవో రామరావు నిరంతరం ఆలయంలో వుంటూ అమ్మవారి పూజలు, భక్తులకు దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు,పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు కలిసికట్టుగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా చక్కని వాతావరణం లో అమ్మవారిని దర్శించుకుని తిరిగి వారి వారి గమ్యస్థానానికి వెళుతున్నారు. నవరాత్రులు అన్ని రోజులు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *