ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకొని వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
Tags indrakiladri
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …