విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ మాస్టర్ మైండ్ స్కూల్ నందు,SBI CARD మరియు రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 1500 వందల మంది వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి వరద బాధితులకు సరుకుల ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఇటువంటి కష్ట సమయాల్లో వరద బాధితులకు అండగా నిలుస్తూ వారి ఆకలి తీర్చే విధంగా నిత్యవసరాలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషమని ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తే ఎంతోమందికి ఆకలి తీర్చే విధంగా ఉంటుందన్నారు. …వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అందుబాటులో ఒక ప్రక్కన వైద్య బృందాలు అత్యవసర మందులతో పాటు ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఔషధాలను కూడా వైద్య సిబ్బంది ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి ఎటువంటి అంటురోగాలు రాకుండా చూసుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. అతి త్వరలో ప్రజలు మళ్లీ సాధారణ స్థితికి వస్తారని అనునిత్యం ఈ వరదల్లో సైతం ప్రజలతో కలిసి మా తెలుగుదేశం పార్టీ కూ టమి నాయకులు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయిన వారికి పాతికవేల రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ లో వారికి పదివేల రూపాయలు, వరదల్లో దెబ్బతిన్న వెహికల్స్ కు మూడు వేల రూపాయలు అందజేసిన ఏకైక ప్రభుత్వం భారత దేశంలోనే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు న్యూ రాజీవ్ నగర్ నందు ప్రజలకు బియ్యం, నూనె, కందిపప్పు, పంచదార అన్ని వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నామని ఈ సందర్భంగా 1500వందల మందికి వరద బాధితులకు ఇంత పెద్ద సహాయం అందించినటువంటి SBI CARD మరియు రౌండ్ టేబుల్ ఇండియా వారిని అభినందించడం జరిగింది.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …